ప్రజారోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని ఎంపీడీవో కృష్ణమోహన్ తెలిపారు. అల్లవరం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శిలతో నిర్వహించిన సమీక్షలో సోమవారం ఆయన మాట్లాడారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల గ్రామాల్లో ప్రజారోగ్యానికి ఎటువంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు క్లోరినేషన్ చేయించాలన్నారు. ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహణ చేపట్టాలన్నారు.