జిల్లాలో అనుమతులు లేని ఆక్వా చెరువులకు సరఫరా కట్

78చూసినవారు
అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా నడుస్తున్న ఆక్వా చెరువులకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని అధికారులకు కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. ఈ మేరకు అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద మత్స్య శాఖ, విద్యుత్, పోలీస్ శాఖల అధికారులతో ఆయన బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆక్రమిత భూములలో ఆక్వా చెరువుల సాగు నిర్వహిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్