అనపర్తిలో వైభవంగా వీరుళ్లమ్మ అమ్మవారి హరిద్రాభిషేకం

76చూసినవారు
అనపర్తిలో కొలువై ఉన్న శ్రీ వీరుళ్లమ్మ అమ్మవారి ఆలయంవద్ద శుక్రవారం హరిద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 1008 మంది మహిళలు గోదావరి నది జలాలతో స్వయంగా అమ్మవారి మూలవిరాట్‌కు అభిషేకం చేశారు. ముందుగా ఆలయం వద్ద నుంచి ఎర్రకాలువ వద్దకు చేరుకుని కాలువలోని నదీ జలాలను సేకరించిన కలశాలతో అమ్మవారి ఆలయానికి చేరుకుని స్వయంగా అమ్మవారి మూలవిరాట్ కు అభిషేకం చేశారు.

సంబంధిత పోస్ట్