వైసీపీ హయంలో ప్రభుత్వ రూరల్ హెల్త్ సెంటర్ నిర్వీర్యమైందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి అన్నారు. పెదపూడి మండలం గొల్లల మామిడాడ లో ప్రభుత్వ గ్రామీణ వైద్యశాలను ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి లో వైద్యం అందుతున్న తీరు పట్ల రోగులను అడిగి తెలుసుకున్నారు. ఓపి తక్కువ నమోదు అవడం పట్ల ఆరా తీశారు. ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.