బిక్కవోలు మండలం బలభద్రపురం ప్రసన్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. డిసెంబర్ 24 న ప్రారంభమయిన ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతిరోజు వివిధ వాహనాలపై స్వామి వారికీ గ్రామోత్సవం నిర్వహించారు.