జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం సత్కరించారు. బిక్కవోలు గ్రామానికి చెందిన పి శిరీష, ఆర్ లావణ్య జ్యోతి జాతీయ స్థాయి మహిళ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని సత్కరించిన ఎమ్మెల్యే క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.