ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదిలో వరద ఉధృతి గురువారం భారీగా పెరిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి విడుదల చేస్తున్న మిగులు జలాలతో గోదావరి నదిలో వరద వడివడిగా పరుగులు పెడుతోంది. పాసర్లపూడి వైనతేయ వారధి, రైల్వే బ్రిడ్జ్ వద్ద వరద ఉద్ధృతి తీవ్రంగా ఉంది. మరోవైపు పాసర్లపూడి ఏటిగట్టు దిగువన అప్పనపల్లి కాజ్వేను రెండు వైపులా ముంపు నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.