మామిడికుదురు మండలంలోని నగరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సురక్షిత త్రాగునీటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని గ్రామ సర్పంచ్ జాలెం రమణకుమారి తెలిపారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ తాగునీరు వేసే లైన్ పనులను ఆమె బుధవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు జాలెం సుబ్బారావు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు నాయకులు పాల్గొన్నారు.