పేదలకు అండగా నిలవాలి

83చూసినవారు
పేదలకు అండగా నిలవాలి
అల్లా ప్రబోధానుసారం దాన ధర్మాలు చేస్తూ పేదలకు అండగా నిలవాలని పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు సూచించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం మామిడికుదురు సున్నీ జామియా మసీదులో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి, సేమ్యాతో పాటు ఆహారం పొట్లాలను అందజేశారు. ప్రతి ఒక్కరూ సామరస్యంగా మెలగాలని వేణుగోపాలరావు సూచించారు.

సంబంధిత పోస్ట్