దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో టిడిపి సీనియర్ నాయకుడు, ప్రముఖ వైద్యులు కట్టుంగ వెంకటేశ్వరరావు, కొద్ది సేపటి క్రితం అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు అనేక సేవా కార్యక్రమాలు జరిగించారని గ్రామ టిడిపి అధ్యక్షుడు కంటిపూడి సుబ్బారావు తెలిపారు. వైద్యుడిగా సేవలు అందించి అందరికి సుపరిచితుడు మంచి వ్యక్తిని కోల్పోవడంతో గ్రామంలో విషాద చాయ లు అలుముకున్నాయి.