కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలానికి చెందిన బందీల నగేష్ 18 సంవత్సరాల పాటు ఆర్మీలో దేశ సేవ చేసి నేడు పదవీ విరమణతో స్వగ్రామం కిర్లంపూడికి గురువారం రావడం జరిగింది. ఈసందర్భంగా మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తన స్వగృహంలో నగేష్ను ఘనంగా సత్కరించి అనంతరం వారు మాట్లాడుతూ హీరోలు అంటే సినిమా వాళ్లు కాదని, నిజమైన హీరోలు ఆర్మీ జవాన్లని వారే నిజమైన భరత మాత ముద్దుబిడ్డలని కొనియాడారు.