జాతీయస్థాయి సేవారత్న పురస్కారం స్వీకరించిన జనసేన నాయకులు చేకూరి కృష్ణంరాజును భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ ఆధ్వర్యంలో పలువురు నేతలు శుక్రవారం ఘనంగా సత్కరించారు.
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన ఆత్రేయ పురంకు చెందిన కృష్ణంరాజు చేసిన సేవలను పాన్ ఇండియా సోషల్ కల్చరల్ అసోసియేషన్ గుర్తించి సేవారత్న పురస్కారం అందించడం అభినందనీయం అన్నారు.