డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంనుండి విజయవాడ వరద బాధితులకు అందించిన సహాయ వివరాలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తనయులు యువ నాయకులు బండారు సంజీవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదృష్టికి తీసుకెళ్లారు. విజయ వాడలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన కలిశారు. బియ్యం, మంచినీరు, పాలు, కూరగాయలు అందించడంపై చంద్రబాబు యువ నాయకులు సంజీవ్ ను అభినందించారు.