రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో అన్నా మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద బుధవారం ఉదయం ఏర్పాటుచేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మహాకవి గుర్రం జాషువా వారి 53వ వర్ధంతి వేడుకలను సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, సామాజికవేత్త ఐ. ఇ. కుమార్ ఘనంగా నిర్వహించి, గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.