కోనసీమ తిరుపతిగా ప్రఖ్యాతి గాంచిన వాడపల్లి ఆలయాన్ని, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలోని వాడపల్లిలో శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి స్వామివారిని దర్శించుకుని, పవిత్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన యాగ కార్యక్రమంలో పాల్గొన్నారు.