స్వాతంత్ర్య భారతాన్ని సాధించడానికి నాటి వీరులు ఎన్నో త్యాగాలు చేశారని, నైతిక విలువలు, దేశభక్తితో కూడిన నవతరం అభివృద్ధి చెందడానికి మనమంతా కృషి చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో గురువారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే బండారు పాల్గొన్నారు.