మద్యం పాలసీ దరఖాస్తుకు 9వ తేదీ వరకు అవకాశం
నూతన మద్యం పాలసీ విధానంలో దరఖాస్తులను ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అందజేయాలని కొత్తపేట ప్రోహిబిజన్ అండ్ ఎక్సైజ్ సీఐ కాత్యాయని తెలిపారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఆదివారం ఆమె మాట్లాడుతూ మద్యం షాపునకు దరఖాస్తు చేసుకునే వ్యక్తి డి. పి. అండ్ ఈ. వో. కోనసీమ డిస్ట్రిక్ట్ పేరు మీద డిడి తీయాలన్నారు. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తు చేసుకునే వ్యక్తి తమ ప్రతినిధి డిక్లరేషన్ ఇవ్వాలన్నారు.