జిల్లా కలెక్టరేట్ కార్యాలయoలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో గురువారం జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా జిల్లాలోనే ఉత్తమ ఎంపీడీఓ గా ఎన్నికైన చాగల్లు మండల ఎంపీడీఓ ఎన్. బుజ్జి మరియు ఏంజిఎన్ఆర్జిఎస్ టెక్నీకల్ అసిస్టెంట్ భాస్కర్ లు స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా గురువారం అవార్డును తీసుకొన్నారు. మండల సిబ్బంది ఎంపిపి మట్టా వీరాస్వామి, ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు అభినందనలు తెలిపారు.