కొవ్వూరు: ముంపు నుంచి పంట పొలాలను రక్షించాలి

70చూసినవారు
శాసనసభ అసెంబ్లీ సమావేశాలలో శనివారం కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తన గళాన్ని వినిపించారు. కొవ్వాడ కాలువ వల్ల వర్షాకాలంలో వేలాది ఎకరాలు నీట మునుగుతున్నాయని అన్నారు. సంబంధిత శాఖ మంత్రి స్పందించి కొవ్వాడ కాలువ ముంపు నుంచి పంట పొలాలను రక్షించేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్