నిరుద్యోగ యువకులకు ఈ 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగవకాశాలు కల్పించాలని లక్ష్యంతో కూటమి పనిచేస్తుందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పుడి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం కొవ్వూరు ఏబీఎన్ & పిఆర్ఆర్ కాలేజీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 21న ఏబీఎన్ కాలేజీలో మెగా జాబ్ మేళా జరుగుతుందన్నారు. దాదాపు 34 కంపెనీలు పాల్గొంటాయని అందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలన్నారు.