మండపేట మండలం మండపేటలో ప్రసిద్ధిచెందిన పావన పేరంటాలమ్మ జాతర మహోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కొత్తగా వివాహాం చేసుకున్న దంపతులు అమ్మవారిని దర్శించి మొక్కుబడులను చెల్లించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.