కాట్రేనికోన జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం 1979-80 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆనందోత్సహలతో జరుపుకున్నారు. దాదాపు 35 మంది పూర్వపు విద్యార్థులు పాల్గొని తమ 60 ఏళ్ల ప్రస్థానంలో జరిగిన అనుభవాలను నెమరు వేసుకున్నారు. ఆనాటి విద్యార్ధి జీవితాన్ని తలుచుకుని పాత మధురస్మృతులను పంచుకున్నారు. పాఠశాల అభివృద్ధికి మన బ్యాచ్ తరపున ఒక మంచి పని చేసి బహుమతిగా ఇవ్వాలని కోరగా అందరూ అందుకు సమ్మతించారు.