వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ ఐ. పోలవరం మండలం మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి కళ్యాణం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్త దంపతులు కళ్యాణంలో కర్తలుగా పాల్గొన్నారు. ఆలయ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. స్వామివారి కల్యాణంలో పాల్గొన్న వారి కోర్కెలు నెరవేరడటంతో పాటు శీఘ్రంగా వివాహం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.