ముమ్మిడివరం మండలంలో గురువారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలం పరిధిలోని పలు గ్రామాలలో పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు పూర్తి జలమయం అయ్యాయి. ఉదయం నుండి ఎండ ఉండగా, మధ్యాహ్నానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం దంచికొట్టింది. వర్షానికి సాయంత్రం కళాశాల, పాఠశాలల నుండి ఇంటికి వెళ్లే విద్యార్థులు బద్దలు పడ్డారు.