పల్లంకుర్రు పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహం

62చూసినవారు
పల్లంకుర్రు పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహం
కాట్రేనికోన మండలం పల్లంకుర్రు పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించారు. స్మశాన వాటిక సమీపంలో ఈ మృతదేహం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆ మృతదేహం ఎవరిది అన్న దిశగా దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని పోలీస్ స్టేషన్ లలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలను సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్