ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి సమస్యల పరిష్కారం కోరుతూ 8 అర్జీలు అందాయని ఆర్డీవో శ్రీరమణి తెలిపారు. పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆర్డీవో కె. శ్రీరమణి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు పంపించి నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామని అన్నారు.