భారతదేశానికి మొట్టమొదటి టీచర్ అమ్మ స్వర్గీయ సావిత్రిబాయి పూలే జయంతి పిఠాపురం ఆర్ఆర్ పార్క్ సమీపంలో గల లైబ్రరీలో ప్రజా 5సంఘాల నాయకులు సాకా రామకృష్ణ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్ ,జె పెట్రిక్ మాస్టర్ ముఖ్య అతిథులుగా పాల్గొని చిత్రపట్టానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను ఒక్కొక్కరు తమ ఉపన్యాసాల ద్వారా తెలియపరిచారు.