పిఠాపురం: బి. ప్రత్తిపాడులో ప్రబలిన డయేరియా

79చూసినవారు
పిఠాపురం: బి. ప్రత్తిపాడులో ప్రబలిన డయేరియా
కాకినాడజిల్లా పిఠాపురం మండలం బి. ప్రత్తిపాడులో డయేరియా ప్రబలింది. 4రోజులుగా గ్రామంలో వాంతులు, విరోచనాలతో బాధపడుతూ సుమారు 30మందికి పైగా ప్రభుత్వ, ప్రవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిల్వ చేసిన పదార్థాలతో పాటు హో టల్ నుంచి తీసుకువచ్చిన బిరియానీ తినడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. శుక్రవారం ప్రత్తిపాడు గ్రామంలో విరవ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ఇందిర, వైద్య సిబ్బంది పర్యటించారు.

సంబంధిత పోస్ట్