తిరుమల లడ్డు ప్రసాదాన్ని గత వైసీపీ ప్రభుత్వం కలుషితం చేయడం ద్వారా కోట్లాది భక్తుల ఆగ్రహానికి గురి చేసిందని ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్తం దీక్షకు మద్దతుగా జనసేన నిర్వహిస్తున్న దీక్ష శిబిరాన్ని శనివారం సందర్శించి, దీక్షలో ఉన్న వారికి సంఘీభావం తెలిపారు. సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.