ర్యాగింగ్‌కు పాల్పడి జీవితం నాశనం చేసుకోవద్దు

79చూసినవారు
ర్యాగింగ్‌కు పాల్పడి జీవితం నాశనం చేసుకోవద్దు
ర్యాగింగ్‌కు పాల్పడి విద్యార్థులు తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ నిక్సన్ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం రాజమండ్రిలోని వ్యవసాయ కళాశాలలో విద్యార్థులతో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మాదకద్రవ్యాల వినియోగానికి విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. వాటి వినియోగం వలన కలిగే అనర్ధాలను వివరించారు.

సంబంధిత పోస్ట్