దేవి నవరాత్రుల సందర్భంగా రాజమండ్రి పట్టణంలోని దేవి చౌక్ & జే. ఎన్ రోడ్డులో ఉన్న దేవి మండపాలను మంత్రి కందుల దుర్గేష్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పూజలు అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.