రాజమండ్రి: 11 ఇసుక ర్యాంపులకు అనుమతులు

64చూసినవారు
రాజమండ్రి: 11 ఇసుక ర్యాంపులకు అనుమతులు
తూ. గో జిల్లాలో 11 ఇసుక ర్యాంపులలో త్రవ్వకాలకు అనుమతులు మంజూరు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నారాముడు తెలిపారు. ఆయన రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ నుంచి సోమవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇసుక ర్యాంపులలో త్రవ్వకాల కోసం యంత్ర పరికరాలను వినియోగించరాదని ఆయన సూచించారు. నిబంధనలు అతిక్రమించి, అనుమతులు లేకుండా త్రవ్వకాలు జరిపిన అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్