తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌ని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు కలిశారు. శుక్రవారం రాజమండ్రిలోని ఎస్పీ కార్యాలయానికి వెళ్లి పూల బొకే అందజేశారు. నియోజకవర్గంలోని పలు విషయాలపై ఎస్పీతో చర్చించారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు తమవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే చెప్పారు.