కడియం మండలం దుళ్ళ గ్రామ దేవత అయిన శ్రీ పోలేరమ్మ అమ్మవారికి అదే గ్రామానికి చెందిన చిట్టూరి వెంకట్రావు, సూర్య ప్రభావతి దంపతులు 3 కిలోల వెండి కిరీటాన్ని శనివారం బహుకరించారు. ముందుగా ఈ కిరీటాన్ని గ్రామంలోని తమ నివాసం నుంచి మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకొని వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోలేరమ్మ అమ్మవారికి అలంకరించారు.