కడియం మండలం వేమగిరిలో 2002లో వెంకన్నపై కత్తితో దాడి చేసి హత్య చేసిన కేసులో నేరం రుజువు కావడంతో ముద్దాయి సత్తిబాబుకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 15 వేలు జరిమానా విధించారని కడియం ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. ముద్దాయి భార్య భవాని వేమగిరి తోటకు చెందిన వెంకన్నతో సన్నిహితంగా ఉండడాన్ని చూసిన సత్తిబాబు కత్తితో వారిపై దాడి చేశాడన్నారు. ఈ దాడిలో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.