రాజమండ్రి రూరల్: డిసెంబర్ 22న ఏపీపీఎస్సీ శాఖ పరమైన పరీక్షలు

50చూసినవారు
రాజమండ్రి రూరల్: డిసెంబర్ 22న ఏపీపీఎస్సీ శాఖ పరమైన పరీక్షలు
తూ. గో జిల్లా పరిధిలో ఎపిపి ఎస్సీ ద్వారా శాఖ పరమైన పరీక్షలను డిసెంబర్ 22వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు తెలిపారు. పరీక్షల నిర్వహణపై రాజమండ్రిలోని జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్ లో సంబంధిత శాఖల అధికారులతో శనివారం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కంప్యూటర్ పరీక్షను డిసెంబర్ 22న ఎపిపిఎస్సీ ద్వారా నిర్వహిస్తున్నామని, పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

సంబంధిత పోస్ట్