కడియం నూతన సీఐగా అల్లు వెంకటేశ్వరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తామన్నారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. బాధ్యతలు స్వీకరించిన సీఐకు ఎస్‌ఐలు, సిబ్బంది అభినందనలు తెలిపారు.