తూర్పుగోదావరి జిల్లాలో గడిచిన 24 గంటలలో 435. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. జిల్లాలోని కోరుకొండ మండలంలో అత్యధికంగా 62. 0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని అన్నారు. అదేవిధంగా జిల్లాలోని ఉండ్రాజవరం మండలంలో అత్యల్పంగా 0. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు.