సీతానగరం, దేవీపట్నం మండలాల్లో గోదావరి నీటిమట్టం బుధవారం నాటికి భారీగా తగ్గింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి ఆలయం వద్ద నీటిమట్టం గణనీయంగా తగ్గినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. దండంగి, రావిలంక గ్రామాల మధ్యలో ఉన్న ప్రధాన రోడ్డుపై గోదావరి వరద నీరు ఉండేదని, ఇప్పుడు పూర్తిగా తగ్గిపోవడంతో వాహనాలు ఇబ్బందులు లేకుండా ప్రయాణిస్తున్నాయని స్థానికులు తెలిపారు.