రాజానగరం: ప్రజాసమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే
రాజానగరం మండల ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో గురువారం సాయంత్రం ‘ప్రజావాణి సమస్యలపై పరిష్కార వేదిక' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజానగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ త్వరలోనే వారి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.