రామచంద్రపురం నియోజకవర్గం కె. గంగవరం మండలం ఊడిమూడి గ్రామంలో తాడాల బుజ్జి ఆధ్వర్యంలో ఆదివారం మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్, జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ విచ్చేశారు. ఈ వైద్య శిబిరానికి అమృత రక్ష హాస్పిటల్స్ అధినేత డాక్టర్ మడక రాంబాబు విశిష్ట అతిథిగా హాజరయ్యారు.