రామచంద్రపురం మండల పరిషత్ అభివృద్ది అధికారి ఎన్. వి. రామచంద్రమూర్తి అద్యక్షతన స్థానిక ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. చివరి రోజున శిక్షణా కార్యక్రమమునకు సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు హాజరై వీధి దీపాల ఏర్పాటు నిర్వహణ, ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టం 1994 సెక్షన్ 80, 81, సి సి చార్జీల చెల్లింపులు ప్రభుత్వ విధానం, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక పరిశీలన అంశాలు పై చర్చించారు.