దేవీపట్నం: పాపికొండల విహారయాత్రకు రెండు బోట్లు
దేవీపట్నం మండలం నుంచి పాపికొండల విహారయాత్రకు రెండు పర్యాటక బోట్లు వెళ్లాయని టూరిజం శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం ప్రసిద్ధ పుణ్య క్షేత్రం గండి పోచమ్మ తల్లి ఆలయం వద్ద ఉన్న బోట్ పాయింట్ నుంచి రెండు బోట్లలో 105 మంది పర్యాటకులు వెళ్లినట్లు తెలిపారు. పర్యా టకులందరికీ లైఫ్ జాకెట్లు ఇచ్చామని, వారికి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.