దాహం తీర్చాలంటూ గ్రామస్థుల ధర్నా
రంపచోడవరం మండలం రంప గ్రామంలో తాగు నీటి సమస్య పరిష్కరించాలంటూ గురువారం గ్రామస్థులు ధర్నా చేపట్టారు. ఖాళీ బిందెలతో ప్రధాన రహదారిపై రాస్తా రోకో చేశారు. 750 కుటుంబాలు నివసిస్తున్న తమ గ్రామంలో రక్షిత మంచి నీటి పథకం పని చేయట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.