అడవిపాలెంలో సర్వేను నిరసిస్తూ ధర్నా

78చూసినవారు
మలికిపురం మండలం అడవిపాలెం గ్రామ పంచాయతీ వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీ కమ్యూనిటీ హాల్లో గ్రామ పంచాయతీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ స్థలం గ్రామ పంచాయతీకి చెందినదని అధికారులు చెబుతున్నారు. కానీ ఆ స్థలం ఎస్సీ సొసైటీకి చెందినదని సొసైటీ సభ్యులు పేర్కొంటున్నారు. ఈ వివాదం నడుస్తున్న తరుణంలో రెవెన్యూ అధికారులు స్థలం సర్వేకు సిద్ధమయ్యారు. దీంతో ఎస్సీ సొసైటీ సభ్యులు ధర్నా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్