అల్పపీడన నేపథ్యంలో కురుస్తున్న వర్షాలు సార్వసాగు చేసిని రైతులును కలవరపెడుతున్నాయి. రాజోలు మండలంలో బుధవారం ఉదయం నుంచి వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ సాయంత్రం నుంచి మరల చిరుజల్లులు పడ్డాయి. శివకోడు జాతీయ రహదారి పక్కన పోగు పెట్టిన ధాన్యం రాశులు మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తడిచాయని రైతులు చెప్పారు. సాయంత్రం మళ్లీ వర్షం కురవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.