సఖినేటిపల్లి: కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలి
సఖినేటిపల్లి మండలం లక్ష్మి నరసింహ స్వామి, అనుబంధ ఆలయాల భూములు సాగు చేస్తున్న కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సత్తిబాబు డిమాండ్ చేశారు. బుధవారం కేశవదాసు పాలెంలో కౌలు రైతు సంఘం నాయకులు నల్లి బుజ్జిబాబు అధ్యక్షతన జరిగిన రైతుల సమావేశం ఆయన పాల్గొని మాట్లాడారు. దేవస్థానం బీడు భూములను సాగుచేసుకుని పేదలు కట్టుకున్న ఇళ్లకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.