చికిత్సపొందుతూ మహిళ మృతి
మలికిపురం మండలం కత్తిమండకు చెందిన కె. రత్నకుమారి(58) కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ప్రమాదవశాత్తూ వేడినీళ్లు మీద పడి కాలినగాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం ఈ నెల 21న జీజీహెచ్ లో ఆమె కుటుంబ సభ్యులు చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ రత్నకుమారి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.