కాకినాడజిల్లా కోటనందూరు మండలం కొత్తకొట్టాం, పాతకొట్టం ప్రాంతాలలో తుని ఎమ్మెల్యే యనమల దివ్య బుధవారం పర్యటించారు. ఇటీవలే తాండవ పరివాహక ప్రాంతం పొంగి ప్రవహించడంతో దెబ్బతిన్న గ్రోయన్లు అదేవిధంగా పంటపొలాలను ఎమ్మెల్యే దివ్య పరిశీలించారు. బాధితులను ఆదుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఎకరాకు 10వేల రూపాయిల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారని తెలిపారు.