తుని నియోజకవర్గం జాతీయ కాపు సంఘం అధ్యక్షుడిగా చామవరం గ్రామానికి చెందిన ఎనుముల వెంకట మోహనరంగా నియమించారు. తుని మున్సిపల్ ఉద్యోగి, రాష్ట్ర మున్సిపల్ మినీ సీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యత నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జాతీయ కాపు సంఘం అధ్యక్షులు కర్ణ మురళీకృష్ణ నియామకపత్రాన్ని అందజేశారు. వీరికి మంగళవారం తుని పట్టణ ప్రముఖులు, కాపు సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.